నేను విశ్వక్‌సేన్‌లా కాదు.. ఆమెకు నాలుగు తగిలించేవాడిని : బండి - MicTv.in - Telugu News
mictv telugu

నేను విశ్వక్‌సేన్‌లా కాదు.. ఆమెకు నాలుగు తగిలించేవాడిని : బండి

May 4, 2022

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవీ నాగవల్లిల మధ్య ఫ్రాంక్ వీడియో మూలంగా రేగిన గొడవ పెరిగి పెద్దదయి, మంత్రికి నాగవల్లి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. దీనిపై చాలా మంది నెటిజన్లు హీరో విశ్వక్‌కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. మహిళ అని కాకుండా ఫస్ట్ మనిషిలా బిహేవ్ చేయాలంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఓ టాలీవుడ్ యువ దర్శకుడు బండి సరోజ్ కుమార్ హాట్ కామెంట్లు చేశాడు. ‘విశ్వక్ సేన్ మంచోడు కాబట్టి ఒక్క బూతు మాటతో వదిలేశాడు. అదే నేనైతే ఆమెకు నాలుగు తగిలించేవాడిని. మహిళ అని ఒన్ సైడ్ మాట్లాడొద్దు. నా దృష్టిలో జెండర్ కార్డ్ అనేది జాతి, కులం, మతం కార్డులకు ఏమాత్రం అతీతం కాదు. ఫస్ట్ మనిషిలా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి’ అని డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. కాగా, బండి సరోజ్ కుమార్ నిర్బంధ్, నిర్బంధ్ 2 చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.