Young Hero sundeep kishan changes his name as sundeep michael kishan
mictv telugu

పేరు మార్చుకున్న సందీప్ కిషన్.. ఆమెతో పెండ్లి కోసమేనా?

December 22, 2022

Young Hero sundeep kishan changes his name as sundeep michael kishan

సినిమా వాళ్లు ఏం చేసినా కొంత రచ్చ‌… కొంత గంద‌ర‌గోళం అవుతుందీ మ‌ధ్య‌. ఉద్దేశ్య‌పూర్వ‌కంగా చెయ్య‌క‌పోయినా ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవ‌డం లేదు. సందీప్ కిష‌న్‌కి కూడా అలాంటి త‌ల‌నొప్పే వ‌చ్చి పడింది. ఒక‌టి పేరు మార్చుకోవ‌డం ఏంట‌ని అభిమానులు గోల చేస్తుంటే… మరొక ప్రశ్నగా రెజీనాతో పెళ్లేంటి అంటూ ఫైర్ అవుతున్నారు.

ప్రస్థానం సినిమాతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సందీప్‌.. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌, బీరువా, ర‌న్‌, డీ అంటే దోపిడీ వంటి కంటెంట్ బేస్డ్ స్ర్కిప్ట్‌ల‌తో కెరీర్‌ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్ర‌స్తుతానికి మాత్రం త‌న దృష్టి అంతా మైకేల్ చిత్రంపైనే ఫోక‌స్ చేశాడు. ఎన్ని క‌థ‌లు త‌న వ‌ద్ద‌కు వ‌స్తున్నా.. ఆచితూచి సెల‌క్టివ్‌గా క‌థ‌ల ఎంపిక చేసుకుంటున్నాడు.

ఇదిలా ఉండ‌గా..రెజీనా క‌సాండ్రాతో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న సందీప్ కిష‌న్ అంటూ ఇటీవ‌లే కొన్ని వార్త‌లు బయటకొచ్చాయి. అందుకు కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో క్లోజ్‌గా ఉన్న ఫొటో పోస్ట్ చెయ్య‌డం వ‌ల్ల ఈ దుమారం లేచింది. అయితే ఇటీవల తాను చేసిన ఓ ప‌నికి మ‌ళ్లీ వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారాడు ఈ యంగ్ హీరో.. త‌న త‌దుప‌రి ప్యాన్ ఇండియ‌న్ పిక్చ‌ర్ మైకేల్ సినిమా లోని మైకేల్ అనే పేరును క‌లుపుకొని సందీప్ మైకేల్ కిష‌న్ అని పెట్టుకున్నాడు.

అయితే క్రిస్మ‌స్ పండుగ వ‌స్తుండంతో త‌న పేరులో మైకేల్ యాడ్ చేశాడ‌ని అభిమానులు ఫైర్ అవుతున్నారు. కంటెంట్ మీద టార్గెట్ చెయ్య‌కుండా ఇలాంటి ప‌నులేంటి అంటూ ఇన్‌స్టాలో కామెంట్లు చేస్తున్నారు సందీప్ ఫ్యాన్స్‌. సినిమా అని ఒక‌రు.. క్రిస్మ‌స్ అని కొంద‌రు… ఇదంతా కాదు.. రెజీనాతో పెళ్లి చేసుకోబోతున్నాడు కాబ‌ట్టి ముందుగానే హింట్ ఇస్తున్నాడ‌ని అంటున్నారు మ‌రికొంద‌రు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వార్త‌ల మీద సందీప్ స్పందించ‌క పోవ‌డంపై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇన్‌స్టాగ్రామ్ లో త‌న పేరు మార్చుకుని మ‌ళ్లీ వార్త‌ల్లోకెక్కాడు సందీప్ కిష‌న్‌.