Young kid plays Kabaddi in inspiring video; his determination will SHOCK you
mictv telugu

కబడ్డీ బుడ్డోడు.. జానెడు లేకున్నా బారెడు మనిషిని పట్టేసి.. వీడియో

September 19, 2022

పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతను మరోసారి నిజం చేస్తూ.. ఓ చిన్న పిల్లాడు పెద్దవాళ్లతో కలిసి కబడ్డీ ఆడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కబడ్డీ ప్రేమికులను ఆ వీడియో బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రహ్లాద్ మీనా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో కబడ్డీ మ్యాచ్ జరుగుతోంది. ఒక టీమ్‌లో ఉన్న ఓ చిన్న పిల్లవాడు ఎంతో ఉత్సాహంతో ఆడుతున్నాడు. తనకంటే మూడింతల హైట్ ఉన్న వ్యక్తి కూతకు వచ్చినప్పుడు ఆ చిన్నారి అతడిని పట్టుకున్న తీరు చాలా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గెలుపోటమిల సంగతి ఎలా ఉన్నా ఆ బుడతడి ఆత్మవిశ్వాసానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.