వయాగ్రా డోసు ఎక్కువై.. లాడ్జీలో యువకుడి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

వయాగ్రా డోసు ఎక్కువై.. లాడ్జీలో యువకుడి మృతి

July 5, 2022

గర్ల్ ఫ్రెండ్‌తో కలసి లాడ్జికి వెళ్లిన ఓ యువకుడు.. కాసేపటికి స్పృహ కోల్పోయాడు. ఎంతసేపటికీ అతడు లేవకపోయేసరికి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సదరు యువకుడిని డాక్టర్లు పరీక్షించగా.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. మృతుడి జేబులో వయాగ్రా మాత్రలు పోలీసులకు లభించాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అజయ్ అనే 25 ఏళ్ల యువకుడు తన ప్రేయసితో కలిసి ఆదివారం సాయంత్రం సావనేర్‌లో ఉన్న ఓ లాడ్జికి వెళ్లాడు. రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలన్న ఉద్దేశ్యంతో శృంగార సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు..ప్రియురాలితో శృంగారం చేస్తుండగా ఒక్కసారిగా అజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఎంతసేపటికి లేవకపోయేసరికి భయపడిన అతడి ప్రియురాలు.. ఈ విషయాన్ని లాడ్జి సిబ్బందికి.. ఫోన్ ద్వారా అతడి స్నేహితుడికి తెలియజేసింది. వారంతా హుటాహుటిన అజయ్‌ని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి.. అప్పటికే అజయ్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలన్న ఉద్దేశ్యంతో ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్ ల కారణంగానే అతడు మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అజయ్ మరణంతో అతడి కుటంబంలో విషాదం నెలకొంది.