Young Man Dies In Hyderabad Adventure Club In Vikarabad Dist
mictv telugu

ప్రాణం తీసిన ట్రెజర్ హంట్ గేమ్.. యువకుడు మృతి

October 30, 2022

వికారాబాద్‌ సమీపంలోని గోధుమగూడ వద్ద ఉన్న ఓ అడ్వెంచర్‌ క్లబ్‌లో దారుణం జరిగింది. డేంజరస్ గేమ్‌లో పాల్గోన్న 35 ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌కు చెందిన సాయి కుమార్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి నిన్న సాయంత్రం అడ్వెంచర్ క్లబ్‌కు వెళ్లాడు. బావిలో పడేసిన వస్తువును తీసుకురావడమే ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం. ఈ గేమ్ లో పాల్గొనదలిచిన వారు బావిలో వేసిన వస్తువును బయటకు తీసుకురావాలి. నిన్న సాయంత్రం గోధుమ గుడాలోని మూన్ లైట్ రిసార్ట్స్ కి చేరుకున్న హైదరాబాద్ కు చెందిన యువకులు.. ఈ గేమ్ ఆడారు. అందులో పార్టిసిపేట్ చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సాయికుమార్ బావిలో పడిన వస్తువును తీసుకొచ్చేందుకు బావిలోకి దిగి మృతి చెందాడు. రిసార్ట్స్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టడంతో బావిలో ఆ వ్యక్తి దూకాడు. అయితే ఆ బావిలో దూకిన వ్యక్తి మృతి చెందాడు.

ఈ ప్రాంతంలో సరైన వెలుగు లేకపోవడం కూడా సాయి కుమార్ మృతికి కారణంగా ఈ గేమ్ లో పాల్గొన్నవారు చెబుతున్నారు. బావిలో దిగిన సాయి కుమార్ ఎంతకీ బయటకు రాకపోవడంతో బావిలో వెతికితే సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. టెక్కీ మృతదేహన్నిపోస్టు మార్టం కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిసార్ట్స్ లో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.