క్వారంటైన్‌లో యువకుడి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

క్వారంటైన్‌లో యువకుడి ఆత్మహత్య

May 19, 2020

Young Man in Chennai Quarantine

క్వారంటైన్ సెంటర్‌లో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని తేనిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే అతడు మహారాష్ట్ర నుంచి నగరానికి రావడంతో అతన్ని క్వారంటైన్ చేశారు. ఈ క్రమంలో ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. అతడి మరణానికి కారణాలేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

అండిపట్టికి చెందిన శశికుమార్ ఇటీవల ముంబై నుంచి వచ్చాడు. ఈ విషయం తెలిసి అధికారులు పరీక్షలు జరిపి  14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. దానికి అతడు నిరాకరించారు. తనకు ఏం లేదని తానెందుకు క్వారంటైన్‌కు రావాలని నిలదీశాడు. దీంతో అధికారులు వచ్చి అతన్ని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం శశికుమార్ తానుంటున్న క్వారంటైన్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అతన్ని క్వారంటైన్‌కు తరలించామనే  ఆత్మహత్య చేసుకున్నాడా అని వణికిపోతున్నారు.