మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంట తిప్పుకుంటూ హద్దు మీరి ప్రవర్తించడంతో.. ఆ యువకుడిని బాలిక తల్లిదండ్రులు మందలించారు. అతని కుటుంబంలో కూడా పెళ్లికి ముందు ఇలాంటి వేషాలు వేయొద్దని.. ఏదైనా పెళ్లి తర్వాతే.. అని కండీషన్ పెట్టారు. దీంతో ఆ యువకుడు బాలిక ఇంటికి వచ్చి తాళి కట్టాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. మైనర్ బాలికను పబ్లిక్‌గా పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఎనిమిదో తరగతి చదువుతోన్న 14 ఏళ్ల బాలికకు.. శ్రీకాంత్ (24) అనే యువకుడు.. ప్రేమ పాఠాలు నేర్పాడు. అర్ధం చేసుకోని వయస్సులో ఉన్న ఆ బాలిక కూడా యువకుడి ట్రాక్‌లోకి వెళ్లిపోయింది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని, అది కాస్తా కుటుంబసభ్యుల వరకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాంత్ ప్రేమకు అతని తల్లిదండ్రులు అడ్డుచెప్పారట. పెళ్లి చేసుకున్న తర్వాతే అమ్మాయితో తిరగాలని కండీషన్ కూడా పెట్టారట. దీంతో, బాలిక ఇంటికి వెళ్లిన శ్రీశాంత్.. పబ్లిక్‌గానే ఆ బాలిక మెడలో తాళికట్టేశాడు. ఆ తర్వాత బాలిక నుంచి గానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి గానీ.. ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియాలో.. మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది.