త్రాచుపాములతో యువకుడి చెలగాటం.. చివరకు.. - MicTv.in - Telugu News
mictv telugu

త్రాచుపాములతో యువకుడి చెలగాటం.. చివరకు..

March 17, 2022

x ppp

కర్ణాటక రాష్ట్రంలో ఓ యువకుడు పాములతోనే స్టంట్ చేయాలని ప్లాన్ వేశాడు. ఏకంగా మూడు తాచుపాములకు ఏదో క్లాసులు చెప్తున్నట్లు ఫోజులిచ్చాడు. ఇంతలోనే ఓ పాము ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక ప్రాంతం సిర్సీకి చెందిన మాజ్ సయ్యద్ అనే యువకుడు పాములతో స్టంట్‌లు చేస్తుంటాడు. అయితే, మూడు నాగుపాములను పట్టి వాటితో స్టంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సమయంలో మూడు పాముల ఎదుట కూర్చొని వాటిని ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో వాటి తోకలను పట్టుకోని లాగుతూ కదిలిస్తుండగా.. తాచులు దూకుడుగా స్పందించాయి. ఓ పాము ఒక్కసారిగా యువకుడిపై దాడి చేసింది. తన నోటితో ప్యాంట్‌ను గట్టిగా పట్టుకుంటుంది.

అయితే, వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు దాని తోక పట్టుకొని లాగేందుకు ప్రయత్నించినా అది గట్టిగా పట్టుకోని కాటువేసింది. దీంతో సయ్యద్ ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం సయ్యద్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పలువురు తీవ్రంగా స్పందించారు. సయ్యద్‌కి చెందిన యూట్యూబ్ ఛానెల్‌లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా యువకుడి తీరుపై మండిపడ్డారు. పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి భయంకరమైన విన్యాసాలు తగదంటూ సూచించారు. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు.