నైజీరియా ‘మల్లేశం’.. అమ్మ కష్టం చూడలేక రోబో ఆవిష్కరణ - MicTv.in - Telugu News
mictv telugu

నైజీరియా ‘మల్లేశం’.. అమ్మ కష్టం చూడలేక రోబో ఆవిష్కరణ

July 9, 2019

సాంకేతికత రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. మేధావులు, స్టూడెంట్స్ వారి మేధస్సును ఉపయోగించి కొత్త కొత్త పరికరాలను కనుగొంటున్నారు. తాజాగా నైజీరియాకు చెందిన 12 ఏళ్ల చిన్నారి బట్టలు మడతపెట్టే రోబోను కనిపెట్టాడు. ఆ రోబో బట్టల్ని క్షణాల్లో మడతపెట్టేస్తుంది. ఏదైనా డ్రెస్, టీ షర్ట్ లాంటిది దానికి ఇచ్చామంటే చాలు… మూడు సెకండ్లలో మడతపెట్టేస్తుంది. 

నైజీరియన్లు ఎక్కువగా టీ-షర్టులు ధరిస్తారు. లాండ్రీలో ఆ చిన్నారి తల్లి బట్టలు మడత పెట్టేందుకు ఇబ్బంది పడటం చూశాడు. అమ్మకు సాయంగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ క్షణంలో తయారుచేసినదే ఆ రోబో. కేవలం పిన్స్, చిన్న లైట్లు, ఈవీ3 బ్రిక్స్ వంటి వాటితోనే దాన్ని తయారుచేశాడు. దీంతో అమ్మ కష్టం చూడలేక రోబో తయారుచేసిన చిన్నారికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.