హాయ్ డార్లింగ్స్.. రేపు మీకో సర్‌ప్రైజ్: ప్రభాస్ - MicTv.in - Telugu News
mictv telugu

హాయ్ డార్లింగ్స్.. రేపు మీకో సర్‌ప్రైజ్: ప్రభాస్

May 20, 2019

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. బాలీవుడ్ భామా శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా, సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 90 శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నైట్ ఎఫెక్ట్‌లో కీలకమైన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏం రాకపోతుండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క అప్‌డేట్ ఇవ్వండి గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు సాహో అప్‌డేట్ ఇచ్చేందుకు ఏకంగా డార్లింగ్ ప్రభాస్ రంగంలోకి దిగారు. సస్పెన్స్‌కు తెరదించుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. అందులో ప్రభాస్ ఏం అన్నాడంటే?

‘హాయ్ డార్లింగ్స్, హౌ ఆర్ యూ, టు మారో ఐ హేవ్ సర్‌ప్రైజ్ ఫర్ యూ, చెక్ ఇట్ అవుట్ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్’ అంటూ సాహో అప్‌డేట్‌‌ గురించి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పాడు. స్వయంగా ప్రభాసే వీడియో రిలీజ్ చెయ్యడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతూనే, రేపు సాహోకి సంబంధించి ఏం అప్‌డేట్ ఇస్తారా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.