పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అమెరికాకు బయలు దేరారు. ఆస్కార్ కోసం ఆయన అమెరికాకు వెళ్తున్నారు. ఆ సందర్భంగా ఆయన ఎయిర్ పోర్టులో సందడి చేశారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో ఎన్టీఆర్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇందులో నయాలుక్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి…చిన్నపాటి గెడ్డంతో స్టయిలీష్ లుక్ అదరగొట్టారు.
Video- Man of Masses #NTR off to the USA, for attending Oscar Awards. @tarak9999 #NTRGoesGlobal #ManOfMassesNTR #RRR pic.twitter.com/hDW3wQf0q6
— Vamsi Kaka (@vamsikaka) March 6, 2023
కాగా రాంచరణ్ తో కలిసి ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది . ఈనెల 12 ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. అత్యున్నత పురస్కారం నాటునాటు పాటకు వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీగా ఉన్నారు రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి. వరుసగా ఇంటర్వ్యూలిస్తూ ఆడియెన్స్ తో ముచ్చటిస్తున్నారు.