రిపబ్లిక్ డే విషెస్ చెప్పినందుకు యువతి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

రిపబ్లిక్ డే విషెస్ చెప్పినందుకు యువతి అరెస్ట్

March 28, 2022

wtsup

ఏంటీ, రిపబ్లిక్ డే విషెస్ చెప్పినందుకు అరెస్ట్ చేస్తారా? అంటూ ఆశ్చర్యపోకండి. ఆ యువతి చెప్పింది పాకిస్తాన్ రిపబ్లిక్ డే గురించి. హిజాబ్ వివాదం రేగిన కర్ణాటకలోనే ఈ ఘటన జరిగింది. వివరాల్లోకెళితే.. ఈ నెల 23న మన పొరుగు, శత్రు దేశం పాకిస్తాన్ రిపబ్లిక్ డేను జరుపుకుంది. ఈ సందర్భంగా కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ముథోల్‌కు చెందిన కుథ్మా షేక్ వాట్సాప్‌లో ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. అందులో ‘ శాంతి, ఐక్యత, సామరస్యం వర్ధిల్లేలా ప్రతీ దేశాన్ని భగవంతుడు ఆశీర్వదించాలని వేడుకుంటున్నా’నంటూ పేర్కొంది. మదరసాలో సీనియర్ విద్యార్థిని అయినటువంటి షేక్ చేసిన పని రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పంచుతోందంటూ, అరుణ్ కుమార్ భజంత్రీ అనే సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో శాంతి భద్రతలను కాపాడేందుకు షేక్‌ను అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని ఎస్పీ భారమప్ప జగలసర్ తెలిపారు. అనంతరం బెయిలుపై విడిచిపెట్టినట్టు వెల్లడించారు.