young woman escaped through the food delivery app in newyork
mictv telugu

అత్యాచారానికి గురై బందీ అయింది.. డెలివరీ యాప్‌తో తప్పించుకుంది

June 24, 2022

young woman escaped through the food delivery app in newyork

అపాయంలో కూడా ఉపాయం అంటే ఇదే. ఏపీలో దిశ అనే యాప్‌ను స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపుల నిరోధానికి వాడుతున్నారు. అయితే అలాంటి యాప్ లేకుండా కేవలం ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా బందీగా ఉన్న యువతి దుర్మార్గుడి నుంచి తప్పించుకుంది. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నగరానికి చెందిన 24 ఏళ్ల మహిళ, తన ఇంట్లో ఉండగా, ఓ ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆమె ఫోన్ లాక్కుని గదిలో బంధించాడు. కాసేపటి తర్వాత ఆకలేయడంతో ఫోన్ తిరిగిచ్చేసి.. ఫుడ్ ఆర్డర్ చేయమని ఆదేశించాడు. దీన్ని అవకాశంగా మలచుకున్న మహిళ, ఫుడ్ ఆర్డర్ చేస్తూ దాంతో పాటు పోలీసులు కూడా రావాలని మెసేజ్ పెట్టింది. అది చూసిన డెలివరీ బాయ్, విషయాన్ని రెస్టారెంటు యజమానికి చేరవేయగా, అతను వెంటనే స్పందించి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఆగంతకుడికి అనుమానం రాకుండా ఫుడ్ డెలివరీ బాయ్‌తో పాటు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.