young woman of Jharkhand gave herself a press release that she wanted to a groom for marriage
mictv telugu

వరుడు కావలెను.. వయస్సు తక్కువైనా పర్లేదు

June 12, 2022

young woman of Jharkhand  gave herself a press release that she wanted to a groom for marriage

తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెబుతూ ఓ యువతి ‘వరుడు కావలెను’ అంటూ స్వయంగా ప్రకటన ఇచ్చింది. తనకంటే వయస్సులో కాస్త చిన్న వాడైనా పర్లేదని , ఆసక్తి ఉన్నవారెవరైనా తన ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు అంటూ గోడపై పోస్టర్లు సైతం అంటించింది. ఝార్ఖండ్‌ రాష్ట్రం హజారీబాగ్‌ ఝండా చౌక్‌ సమీపంలోని బంగాలీ దుర్గాకు చెందిన ఓ యువతి… తనకు ఎలాంటి వ్యక్తి కావాలో పూస గుచ్చినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

చేసుకోబోయేవాడు అబద్ధాలు చెప్పకూడదట. ఏ కులానికి చెందినవాడైనా అభ్యంతరం లేదు కానీ పిసినారితనం మాత్రం ఉండకూడదట. మరీ ఎక్కువ చురుగ్గా ఉండనక్కర్లేదని, కాస్త చురుగ్గా ఉంటే చాలని చెప్పింది. తనకంటే చిన్నవాడైనా సరే.. ఆసక్తి ఉంటే సంప్రదించగలరు అంటూ రెండు ఫోన్‌ నంబర్లు కూడా ఇచ్చింది. ఓ పెళ్లి వేడుకలో గోడపై దీన్ని అతికించింది. యువతి ఇచ్చిన ప్రకటన చూసినవాళ్లంతా ఔరా అనుకుంటున్నారు.