Young woman's success by watching YouTube in lockdown, A job in Google with a package of 60 lakhs
mictv telugu

గూగుల్‌లో రూ.60 లక్షల ప్యాకేజీ..లౌక్‎డౌన్‎, యూట్యూబే యువతి విజయ రహస్యాలు

January 9, 2023

Young woman's success by watching YouTube in lockdown, A job in Google with a package of 60 lakhs

ఏదైనా సాధించాలనే తపన ఉంటే..విజయం తథ్యం. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చొకొని జీవితలో ఉన్నత శిఖరాలను అందుకోవచ్చని నిరూపించింది ఓ యువతి. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడి భయంతో బతుకున్న రోజుల్లో కూడా ఆమె తన లక్ష్యం కోసం అడుగులు వేసింది. లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ చివరికి అనుకున్నది సాధించింది. యూట్యూబ్‌లో క్లాస్‎లు విని ఏకంగా ఏడాదికి 60 లక్షల భారీ ప్యాకేజితో గూగుల్‎లో ఉద్యోగం సాధించింది. మీ విజయ రహస్యం ఏంటని ఇప్పుడు అడిగిన వారికి లాక్‌‎డౌన్, యూట్యూబే అని సమాధానం చెబుతుంది గుంటూరుకి చెందిన రావూరి పూజిత.

2020లో గుంటూరులోని కేఎల్‌ వర్సిటీలో పూజిత బీటెక్‌లో జాయిన్ అయ్యింది. అదే సమయంలో కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కళాశాలలు పూర్తిగా మూతపడ్డాయి. కొన్ని రోజులకి ఆన్‎లైన్ క్లాస్‎లు వింటూ అధ్యాపకులను, తోటి విద్యార్థులను, సీనియర్లను అడిగి తన సందేహాలను నివృత్తి చేసుకుంది. ఫస్టియర్‌ మొదటి సెమ్‌లో ఎల్‌ వర్సిటీ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ కోర్సు ప్రవేశపెట్టారు. అలా తన కోడింగ్‌ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆన్‎లైన్‌లో ఆర్థం కాని విషయాలు కోసం యూట్యూబ్‎ని ఆశ్రయించింది. తనకు తెలియని విషయాలను యూట్యూబ్‌లో చూసి నేర్చుకొంది. కోడింగ్‌, ఇతర ప్రాబ్లమ్స్‌తో పాటు ఉద్యోగం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంది. కోడింగ్‎లో పూర్తి పట్టు సాధించింది. ఇంటర్వ్యూలు కోసం సీనియర్లతో మాట్లాడగా వారు తమ అనుభవాన్ని పూజితకు అందించారు. చివరికి గూగుల్, అడోబ్, అమెజాన్ సంస్థల్లో కొలువులు సాధించింది. గూగుల్‎లో 60 లక్షల ప్యాకేజ్, మిగిలిన వాటిలో 45 లక్షలు కావడంతో గూగుల్ అవకాశాన్ని ఎంచుకుంది పూజిత. లాక్ డౌన్‎లో సమయాన్ని వృథా చేయకుండా రాని విషయాలను నేర్చుకోవడం ద్వారానే విజయం సాధించా అంటుంది.