పెళ్లి కార్డులు పంచుతుండగా కిడ్నాప్.. మూడ్రోజుల తర్వాత అమ్మకం - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి కార్డులు పంచుతుండగా కిడ్నాప్.. మూడ్రోజుల తర్వాత అమ్మకం

May 10, 2022

పెళ్లి శుభలేఖలు పంచడానికి వెళ్లిన యువతిని కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు కొన్ని రోజులు తమతో ఉంచుకొని ఆ తర్వాత అమ్మేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఏప్రిల్ 21న పెళ్లి చేసుకోబోతున్న యువతి, అదే నెల 18న శుభలేఖలు పంచడానికి బయల్దేరింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి, కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకొని అత్యాచారం చేశారు. తర్వాత ఓ రాజకీయనాయకుడికి అప్పగించగా, అతను ఆమెను మరికొన్ని రోజులు నిర్భంధించాడు. చివరకు సరిహద్దు గ్రామమైన మధ్యప్రదేశ్‌లోని ధాటియా జిల్లా పఠారి గ్రామంలోని మరో వ్యక్తికి యువతిని అమ్మేశారు. అక్కడ నుంచి బాధిత యువతి ఎలాగోలా తప్పించుకొని తండ్రికి ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించింది. దాంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెళ్లి యువతిని రక్షించారు. యువతికి జరిగిన దారుణంపై ఫిర్యాదు అందిందని, నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.