Young women's romance with a prisoner in britain
mictv telugu

ఖైదీతో యువతుల శృంగారం.. ఆపై ఒకరికి తెలియకుండా మరొకరు

August 24, 2022

బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేస్తున్నవారు దానికి తగ్గట్టు అంతే హుందాగా నడుచుకోవాలి. లేదంటే కెరీర్, వ్యక్తిగతంగా కూడా సమస్యలు వస్తాయి. ఇక్కడ అలాంటిదే జరిగింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీతో ఓ నర్సు, ఓ జైలరు శారీరక సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ విషయం కొన్నాళ్లకు ఉన్నతాధికారులకు తెలియడంతో సీన్ రివర్స్ అయింది. బ్రిటన్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వేల్స్‌లోని బ్రిడ్జెంట్ జైలులో ఓ వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడే నర్సుగా పనిచేస్తున్న ఆలిస్ హిబ్స్, జైలరుగా ఉన్న రూత్ ష్మా అనే యువతులు ఆ ఖైదీతో శారీరక సంబంధం పెట్టుకున్నారు. అంతా తాము అనుకుంటున్నట్టే జరుగుతుందని కొంతకాలం అలాగే ఆ సంబంధాన్ని కొనసాగించారు. కానీ, చివరికి ఉన్నతాధికారులకు తెలియడంతో విచారించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ‘బాధ్యత కలిగిన ఉద్యోగాలు చేస్తూ ఖైదీతో శారీరక సంబంధం పెట్టుకొని జైలు వ్యవస్థను అపహాస్యం చేశార’ని మండిపడింది. వాదోపవాదనలు విని తదుపరి విచారణను సెప్టెంబరుకు వాయిదా వేసింది. కాగా, ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఖైదీతో శారీరక సంబంధం పెట్టుకున్నారు. తర్వాత ఈ విషయం తెలిసి ఇద్దరూ అవాక్కయి సిగ్గుతో తల దించుకున్నారు.