పూటుగా మద్యం తాగడం. డ్రంక్ డ్రైవ్ తనిఖీలలో అడ్డంగా దొరకడం.. తర్వాత బిల్డప్‌లు కొట్టడం ఇదే ప్రస్తుతం తాగుబోతుల ట్రెండ్ గా మారిపోయింది. నేను ఎవరో తెలుసా..? నాకు వాళ్లు తెలుసు, వీళ్ళు తెలుసు అని మద్యం మత్తులో పోలీసులపై తిరగబడుతున్నారు. తాజా హైదరాబాద్‌లో ఓ యువకుడు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ఏకంగా ఎస్సైను కాలితో తన్నాడు.
వివరాలు చూస్తే..బంజారాహిల్స్‌లో పోలీసులు డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కారుతో వస్తున్న యువకుడిని చెక్ చేయగా బ్రీత్ ఎనలైజర్ టెస్టులో 94 శాతంగా నమోదు అయ్యింది. అతడిపై పోలీసులు కేసునమోదు చేశారు. దీంతో ఆ యువకుడు ట్రాఫిక్ పోలీసులతో గొడవకు దిగాడు. ఎందుకు కేసు నమోదు చేశారంటూ దుర్భాషలాడాడు. మీకు సెక్షన్లు తెలుసా అని ప్రశ్నించాడు. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఎస్సైను కాలితో తన్నాడు. అతడితో పాటు కారులో ఉన్న యువతి సైతం పోలీసులుతో దురుసుగా ప్రవర్తించింది. వీడియోలు తీయడంపై పోలీసులను చెడామడా తిట్టింది. వీరిద్దరిపై ట్రాఫిక్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.