భార్యపై కోపాన్ని రైలుపై చూపాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్యపై కోపాన్ని రైలుపై చూపాడు

May 20, 2019

Youngster stop the train after fight with wife.

ఇంట్లో భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి తన కోపాన్ని రైలుపై చూపించిన వింత సంఘటన తమిళనాడులోని శివగంగైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏనాది చెంగోట్టైకు చెందిన షణ్ముగవేల్‌‌కు శుక్రవారం భార్యతో పెద్ద గొడవైంది. దీంతో మనస్తాపానికి గురైన షణ్ముగవేల్ బైక్‌పై నేరుగా తురుభువనం చేరుకుని లాడనేందల్‌ రైల్వే వంతెన కింద మద్యం తాగి అక్కడే నిద్రపోయాడు. ఉదయం బైకును తీసుకెళ్లి పట్టాలపై అడ్డంగా పెట్టి దానిపైనే కూర్చున్నాడు.

అదే సమయంలో మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్న రైలు లోకోపైలట్ పట్టాలపై బైక్ ఉన్న విషయాన్ని దూరం నుంచే గుర్తించి రైలును నిలిపివేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కిందికి దిగిన ప్రయాణికులు పట్టాలపై బైక్‌పై కూర్చున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయారు. బైక్ తీయమని ఎంతమంది అడిగినా కూడా షణ్ముగవేల్ వినిపించుకోలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, వారు వచ్చేసరికే అతడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు షణ్ముగవేల్ కోసం గాలిస్తున్నారు.