నా వల్లే మీ పిల్లలకు టిక్కెట్లు రాలేదు : మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

నా వల్లే మీ పిల్లలకు టిక్కెట్లు రాలేదు : మోదీ

March 15, 2022

02

బీజేపీలో వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అలా చేస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని, ఎంపీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు మోదీ పై విధంగా స్పందించారు. అంతేకాక, ‘చాలా మంది ఎంపీలు, నాయకులు తమ పిల్లలకు పార్టీ టిక్కెట్లు ఇవ్వమని పార్టీపై ఒత్తిడి చేశారు. చాలా మంది అభ్యర్థనను పార్టీ తిరస్కరించింది. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. నా వల్లే మీ పిల్లలకు టిక్కెట్లు రాలేదు. వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ఇన్నాళ్లూ మనం చెప్తూ వస్తున్నాం. దాన్ని మనమే పాటించకపోతే ఎలా? వారసత్వ రాజకీయానికి పార్టీలో చోటిస్తే కులతత్వం పెరిగిపోతుందం’టూ ప్రధాని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, పార్టీ విజయానికి కృషి చేసిన వారికి ప్రధాని అభినందనలు తెలిపారు.