మీ మేనకోడలు బాలకార్మికురాలైంది.. జగన్‌పై అనిత ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

మీ మేనకోడలు బాలకార్మికురాలైంది.. జగన్‌పై అనిత ఫైర్

May 18, 2020

Anita

నెల్లూరు జిల్లాలో చిన్నారితో పనులు చేయించిన ఘటనపై ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విటర్ వేదికగా స్పందించారు. పోలీసులే బాలికతో పనులు చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.  ‘ముఖ్యమంత్రి జ‌గ‌న్‌రెడ్డి ఏపీలో పిల్ల‌లంద‌రికీ నేను మేన‌మామ‌న‌ని ప్ర‌క‌టించుకున్నారు. అయ్యా మేన‌మామ గారూ.. మీ పేద మేన‌ కోడ‌లిని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో పోలీసుల సాక్షిగా బ‌డికి పంప‌కుండా బాల‌ కార్మికురాలిని చేశారు’ అని పోస్ట్ చేశారు. ఈ అన్యాయంపై స్పందిస్తార‌ని కోరుతున్నాను అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

చేస్తున్న గదిలో చిన్నారితో గదిని తుడిపించారని ఆరోపణలు వచ్చాయి. పాఠశాల వాచ్‌మెన్‌ కుమార్తెతో గదిని తుడిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గదిని తుడిపించిన పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బాలల హక్కుల సంఘం కూడా ఈ విషయమై మండిపడింది. పోలీసులే దగ్గరుండి గదిని శుభ్రం చేయించారని.. పిల్లలతో పనులు చేయించకూడదని తెలిసి కూడా ఇలా ప్రవర్తించారని ఆరోపించింది. ఈ ఘటనపై ఏపీ డీజీపీ దృష్టికి తెచ్చి చర్యలు చేపట్టాలని.. పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనపై ఎస్పీ కూడా మండిపడ్డారు.. పూర్తి విచారణకు ఆదేశించారు.