your teeth says about your personality
mictv telugu

మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలా? మీ పండ్లు చెక్ చేయండి!

November 18, 2022

ప్రతీ మనిషికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది. మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలంటే ఆన్లైన్లో టెస్ట్, క్విజ్ పూర్తి చేస్తే కొంత మేరేంటో మీకు తెలిసిపోతుంది. కానీ పండ్లు చూసి మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవచ్చు. అవును మీరు చదువుతున్నది నిజం. మీ పండ్ల ఆకారం మీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

చతురస్రాకారం..

ఈ రకమైన పండ్లకు కింద వైపు చదునైన అంచులు ఉంటాయి. ఈ పండ్లు పర్ఫెక్ట్ ఆకారంలో ఉండకుండా చివర గుండ్రంగా ఉంటాయి. వీళ్లు కాస్త ప్రశాంతంగా ఒక లక్ష్యంతో ముందుకు సాగే వ్యక్తులు. అంతేకాదు.. చూడడానికి కూడా గంభీరంగా కనిపిస్తారు. ప్రతీ పనిలో మంచి సమర్థత కలిగి ఉంటారు. అన్ని విషయాల్లోనూ పరిణతి చూపిస్తారు.

త్రిభుజాకారం..

ఈ ఆకారాన్ని కింద భాగంలో చూడకూడదు. పైన వైపు ఈ ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. త్రిభుజాకారంలో దంతాలు ఉన్నవాళ్లు స్వేచ్ఛభావాలు కలిగినవాళ్లుగా ఉంటారు. అంతేకాదు..క్రియేటివ్ ఆలోచనలు ఉంటాయి. ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. ముక్కుసూటి మనుషులుగా, ఏ చిన్న విషయానికైనా కోపం తెచ్చుకుంటారు. దీనివల్ల వారి జీవితంలో కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గుడ్డు ఆకారంలో..

ఈ ఆకారంలో దంతాలు ఉంటే.. వీరి ఆలోచనలు ఎప్పుడూ యవ్వనంగానే ఉంటాయట. అంతేకాదు.. చాలా పాజిటివ్గా వ్యవహరిస్తారు. స్వేచ్చాభావాలు కూడా ఎక్కువ. సామాజిక జీవితాన్ని ఎక్కువ ఇష్టపడుతారు. అందుకే వీరిని ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒకరకంగా వీరిలో ఏదో అయస్కాంత శక్తి ఉందనే చెప్పొచ్చు.

దూరం దూరంగా..

చాలావరకు కామన్గా కొందరిలో కనిపించే దంతాల వరుస ఇది. ఇలా దూరం ఉన్నవాళ్ల పండ్లు కోడిగుడ్డు, చతురస్రాకారల కలయికగా కనిపిస్తుంది. ఈ ఆకారంలో పండ్లు ఉన్నవాళ్లు ప్రశాంతంగా ఉంటారు. అధునాతన ఆలోచనలు చేస్తారు. వారి స్నేహపూర్వక వాతావరణం వల్ల ఇతురులు వీరి పట్ల ఇట్టే ఆకర్షితులవుతారు.