Youth Arrested On Assault Of A Minor Girl At Meerpet in Hyderabad
mictv telugu

మీర్‌పేటలో మైనర్‌ బాలికపై గ్యాంగ్‌రేప్‌..!

November 8, 2022

ఎన్ని కఠినచర్యలు తీసుకుంటున్నా ఆడవారిపై ఆత్యాచారాలు మాత్రం ఆడ్డుకట్టపడటంలేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు పసువుల్లా వారిపై పడి కోరికలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని మీర్‌పేట పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఓ మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు ముగ్గరు వ్యక్తులు. పోలీస్‌ స్టేషన్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై ముగ్గురు కామాంధులు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

మీర్ పేట పీ.ఎస్ పరిధిలోని లెనిన్ నగర్ లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఆ కుటుంబానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక గత రాత్రి తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా.. ఆమెపై కొంతకాలంగా కన్నేసిన కామాంధులు ఇదే సమయం అని భావించి ఆ బాలికను కిడ్నాప్‌ చేశారు. బాలికను మూడు గంటల పాటు బైక్ పై తిప్పి, అర్థరాత్రి 11 గంటల ప్రాంతంలో ఎవరూ లేని ఖాళీ ప్రాంతంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా బాలిక కేకలు వేస్తూ, గట్టిగా అరవడంతో ఘటనా స్థలికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బాలికను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదుతో యువకులపై అత్యాచారం, కిడ్నాప్, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.