Youth gets shot while taking selfie with gun in UP
mictv telugu

గన్‌తో సెల్ఫీ.. పొరపాటున ట్రిగ్గర్ నొక్కడంతో..

July 17, 2022

సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన వారు చాలామంది. కొండ ప్రాంతాల్లో, సముద్ర ప్రాంతాల్లో, ఎత్తైన జలపాతాల వద్ద ఎంతోమంది యువత సెల్ఫీలకు ప్రయత్నించి మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు తుపాకీతో సెల్ఫీ తీసుకుంటూ, పొరపాటున ఫోటోకి క్లిక్ ఇవ్వబోయి ట్రిగర్‌ నొక్కాడు. దీంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది. 17 ఏళ్ల సుచిత్‌ ఆదివారం తన గదిలో గన్‌తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఒక చేతిలోని రివాల్వర్‌ను తల వద్ద ఉంచుకుని మరో చేతిలోని మొబైల్‌ ఫోన్‌లో ఫొటో తీసుకుంటున్నాడు. అయితే పొరపాటున ట్రిగర్‌ నొక్కాడు.

దీంతో బుల్లెట్‌ అతడి తలలోకి దూసుకెళ్లింది. తుపాకీ పేలిన శబ్ధం విన్న కుటుంబ సభ్యులు వెంటనే సుచిత్‌ గదికి వచ్చి చూడగా.. సుచిత్ రక్తం మడుగుల్లో పడి ఉన్నాడు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే యువకుడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సుచిత్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సుచిత్‌ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సఫీపూర్‌ సర్కిల్ ఆఫీసర్ అంజనీ కుమార్ రాయ్ తెలిపారు.