నడిరోడ్డుపై వీరంగం.. కత్తులతో కానిస్టేబుల్‌పై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

నడిరోడ్డుపై వీరంగం.. కత్తులతో కానిస్టేబుల్‌పై దాడి

November 22, 2019

పోలీస్ కానిస్టేబుల్‌పై కొంత మంది యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన సంచలనంగా మారింది. యాక్సిడెంట్ ఈ ఘటనకు కారణమైనట్టుగా స్థానికులు చెబుతున్నారు.  తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌కు చికిత్స అందిస్తున్నారు. 

Rajahmundry.

కోరుకొండ పోలీస్‌ స్టేషన్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరావు బైక్‌పై వెళ్తుండగా మరో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఢీ కొట్టారు. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆ యువకుల బైక్ నంబర్ సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తుండగా ఘర్షణ మొదలైంది. అంతటితో ఆగకుండా కత్తులతో  దాడికి పాల్పడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన యువకులు పరారీలో ఉన్నారు.