తెలంగాణలో రూ. 6 కోట్లతో యూత్ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. బాలలకు, యువతకు నూతన ఆవిష్కరణల కోసం ప్రోత్సాహం, కొత్త విద్యావిధానల రూపకల్పన ఈ హబ్ లక్ష్యం. సోమవారం హైదరాబాద్‌లోని తారామతి భారదరి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం, యునెస్కో కలసి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఆర్‌తోపాటు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను మంత్రులు పరిశీలించి, తయారుచేసిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ”యునెస్కో భాగస్వామ్యంతో దేశంలోనే తొలి యూత్ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకోబోతున్నాం. రూ. 6 కోట్ల ఫండ్‌తో త్వరలోనే నిర్మించబోతున్నాం. ఇది
తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయి. టీచర్ ఇన్నోవేషన్ పోర్టల్‌ను ప్రారంభించుకున్నాం. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద 12 రకాల అంశాలను ప్రవేశపెట్టాం. అదనపు తరగతి గదులు, ఫర్నీచర్, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. కరోనా సమయంలో తలెత్తిన ఇబ్బందులు భవిష్యత్‌లో రాకుండా అత్యుత్తమ బోధన అందించేందుకు డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. మన ఊరు మన బడి దేశానికే ఆదర్శంగా నిలవబోతుంది” అని కేటీఆర్ అన్నారు.
మరోపక్క ఐటీ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 5,387 స్కూల్స్ రిజిస్టరేషన్ చేసుకున్నాయి. 7,003 టీచర్లు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. 25,166 విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 11,037 టీమ్స్ తమ ఆవిష్కరణలను పంచుకున్నాయి. 79 టీమ్స్ షార్ట్ లిస్ట్ లో చేరాయి. 20 టీమ్స్ గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నాయి. జ్యూరీ ద్వారా ఎంపిక కాబడ్డ ఐదు టీమ్స్‌కు బహుమతులు ప్రదానం చేశారు.