Youth Leaders attack TRS MLA’s convoy with chappals, cops use lathi-charge
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాన్వాయ్‌ని అడ్డుకున్న యువజన నాయకులు

November 13, 2022

కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు నిరసన సెగ తగిలింది. గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా రోడ్డువేయాలని కొన్ని రోజులుగా ఆందోళన సాగుతోంది. ఈ క్రమంలోనే రాజీవ్ రహదారిపై యువజన సంఘాలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అదే సమయంలో బాలకిషన్ ఆ వైపుగా రావడంతో ఆయనను అడ్డుకున్నారు. దానితో పోలీసులు లాఠీఛార్జీ చేసి.. ఆందోళనకారులను చెదరగొట్టారు.

అంతలోనే యువజనులకు సంపూర్ణ మద్దతు పలికేందుకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చేరుకున్నారు. స్థానికేతరుడైన రసమయి బాలకిషన్ తెలంగాణ ఉద్యమం పేరుతో మానకొండూరు నియోజకవర్గంలో గెలిచి అభివృద్ధిపై ప్రశ్నిస్తే.. పోలీసుల సాయంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రోడ్డు పరిస్థితి బాగానే ఉందని.. దానిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తెలిపారు.