యూత్ ఇందుకే మద్యానికి ఆకర్షితులు అవుతున్నారట..! - MicTv.in - Telugu News
mictv telugu

యూత్ ఇందుకే మద్యానికి ఆకర్షితులు అవుతున్నారట..!

February 25, 2020

Liquor

టీనేజ్ రాగానే చాలా మంది యువకులు మద్యానికి అలావాటు పడుతున్నారు. దీని కారణంగా మంచి భవిష్యత్ కూడా కొంత మంది కోల్పోతున్నారు. ఇంతకీ వీరు ఎందుకు ఇలా మద్యానికి అలవాటుపడుతున్నానే అంశంపై ఆసక్తికర విషయాలను న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఆకర్షినీయమైన లోగోలు ఉండటమే దీనికి ప్రధాన కారణంగా వెల్లడించారు. 

మద్యం, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడటంపై పరిశోధన చేపట్టారు. దీంట్లో పొగాకు ఉత్పత్తుల  యాడ్స్‌ మద్యం బ్రాండ్‌ల ఆకర్షణీయమైన లోగోలు వారిని ఆకర్షిస్తున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే మద్యం అలవాటు చేసుకుని చాలా మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి యాడ్స్ యువత ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా అలవాటుపడేలా చేస్తున్నాయని వెల్లడించారు.