ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఉరేసుకున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఉరేసుకున్నాడు..

February 7, 2018

భావోద్వేగాలు ఎంత సానుకూలంగా పనిచేస్తాయో అంత ప్రతికూలంగానూ పడగలు విప్పుతాయి. ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు, కాబోయే భార్య తన ఫోన్ కాల్‌కు బదులివ్వలేదని ఒక యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదం  పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం శివారు గొల్లమాలపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.

ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రుకు చెందిన 21 ఏళ్ల వింజేటి నవీన్‌.. గొల్లమాలపల్లికి చెందిన సమీప బంధువైన యువతి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. యువతి తల్లి గల్ఫ్‌లో పనిచేస్తోంది. బంధువులే కావడంతో వీరికి పెళ్లి చేయాలని పెద్దలు కూడా నిర్ణయం తీసుకున్నారు. యువతి తల్లి గొల్లమాలపల్లిలో ఇల్లు కడుతోంది. నవీన్ ఆ పనులను పర్యవేక్షిస్తున్నాడు.ఈ జంట మధ్య ఏం జరిగిందో తెలియదుగాని సోమవారం రాత్రి నవీన్‌  ఫోన్‌  చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో నవీన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. గొల్లమాలపల్లికి వెళ్లి.. ఫోన్ ఎందుకు తీయలేదని, ఇలా చేసినందుకు ఉరిపోసుకుని చస్తానని బెదిరించాడు. ఆమె భయపడిపోయి బంధువులను తీసుకొచ్చింది. అయితే అప్పటికే నవీన్.. ఆమె చున్నీతో ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.