Youth using condoms for intoxication in west bengal
mictv telugu

కొత్తకోణం : కండోమ్‌లతో ఎక్కుతున్న మత్తు.. ఎగబడి కొంటున్న మందుబాబులు

July 23, 2022

Youth using condoms for intoxication in west bengal

లైంగిక జీవితంలో కండోమ్స్ ప్రాముఖ్యత తెలిసిందే. శృంగారం సమయంలో ఎయిడ్స్ వంటి వ్యాధులు రాకుండా కాపడడానికి, భార్యభర్తలైతే పిల్లలు పుట్టకుండా నిరోధించడానికి కండోమ్‌లను వాడుతారనేది బహిరంగమే. కానీ, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన యువత, విద్యార్ధులు కండోమ్‌లను ఎగబడి మరీ కొంటున్నారు. అయితే సెక్స్ కోసం కాదు. వారు కండోమ్‌లలో ఉన్న మరో కోణాన్ని కనుగొన్నారు. కండోమ్‌లను వేడి నీటిలో ఐదారు గంటలు నానబెడుతున్నారు.

తర్వాత కండోమ్‌లు తీసివేసి ఆ నీటిని తాగుతున్నారు. దీనివల్ల నీళ్లకు ఆల్కాహాలిక్ స్వభావం వస్తుందంట. దీంతో స్టూడెంట్లు, యువత మత్తుకు బానిసలవుతున్నారు. ధరల పెరుగుదలతో మద్యాన్ని కొనలేని వారు ఈ విధానం ద్వారా కిక్కు పొందుతున్నారు. వీరి డిమాండుతో స్థానికంగా కండోమ్ స్టాక్ అయిపోయినా కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి మరీ కొంటున్నారంట. కొందరు మైనర్ యువత కోడ్ లాంగ్వేజులు ఉపయోగించి మరీ పెద్ద ఎత్తున కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీనిపై అక్కడి మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.