YouTube CEO Susan Wojciech resigns and Indian-origin Neil Mohan takes over as new CEO
mictv telugu

Youtube: యూట్యూబ్ కొత్త బాస్‎గా భారత సంతతికి చెందిన నీల్ మోహన్ బాధ్యతలు..!!

February 17, 2023

YouTube CEO Susan Wojciech resigns and Indian-origin Neil Mohan takes over as new CEO

ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తుంపు సంపాదించుకున్న ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం యూట్యూబ్ CEOగా భారత సంతతికి చెందిన నీల్ మోహన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే అమెరికాలోని పలు మల్టీనేనల్ కంపెనీలకు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులే సీఈవోలుగా చైర్మన్లుగా కీలకపాత్రల్లో ఉండటం విశేషం. తాజాగా youtubeసీఈవోగా భారతసంతతికి చెందిన నీల్ మోహన్ బాధ్యతలు చేపట్టారు.

వ్యక్తిగత కారణాలతో రాజీనామా :
కాగా యూట్యూబ్ సీఈవో సుసాన్ వోజ్కికీ సీఈవోగా రాజీనామా చేశారు. యూట్యూబ్ కు 9ఏళ్లపాటు సీఈవోగా సేవలందించారు. తాను రాజీనామా చేస్తున్నట్లు తన బ్లాక్ పోస్టు ద్వారా తెలిపారు. సుసాన్ రాజీనామా తర్వాత..యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట ఆఫీసర్, భారత సంతతికి చెందిన నీల్ మోహన్ కొత్త బాస్ గా బాధ్యతలు చేపట్టారు.

కాగా 54 ఏళ్ల వోజ్‌కికీ సుసాన్, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు బ్లాగ్‌ పోస్టులో తెలిపారు. సుసాన్ గతంలో గూగుల్‌లో అడ్వర్టైజింగ్ ప్రొడక్ట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, 2014లో యూట్యూబ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆమె Google ప్రారంభ ఉద్యోగులలో ఒకరు. దాదాపు 25 సంవత్సరాల పాటు Google యొక్క మాతృ సంస్థ అయిన Alphabet Inc.తో అనుబంధం కలిగి ఉన్నారు. Googleకి ముందు, వోజ్‌కికీ ఇంటెల్ కార్ప్, బెయిన్ & కంపెనీలో పనిచేశారు.

2015లో యూట్యూబ్‌లో చేరిన నీల్ మోహన్:
భారత సంతతికి చెందిన నీల్ మోహన్ నవంబర్ 2015 నుండి YouTubeలో చేరారు. అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, నీల్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందారు. సీనియర్ అనలిస్ట్‌గా యాక్సెంచర్‌తో అతని కెరీర్ ప్రారంభమైంది.