YouTube says five ads will appear before the video
mictv telugu

యూజర్లకు యూట్యూబ్ బ్యాడ్ న్యూస్.. ఇక నుంచి ఐదు యాడ్‌లు

September 13, 2022

వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్ తన యూజర్లకు షాకిచ్చింది. వీడియో ప్రారంభంలో ఇప్పటినుంచి వచ్చే ప్రకటనల సంఖ్యను పెంచుతున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు వీడియో ప్రారంభంలో రెండు వీడియోలు ప్లే అవుతుండగా, ఇక నుంచి ఐదు ప్రకటనలు ప్రసారం అవుతాయని వెల్లడించింది.

అయితే ఎవరైతే ఫ్రీగా యూట్యూబ్ చూస్తున్నారో వారికే పరిమితమని పేర్కొంది. డబ్బులు చెల్లించే ప్రీమియం కస్టమర్లకు ఎలాంటి యాడ్స్ ఉండవు. ఒక్కో యాడ్ 6 సెకన్ల పాటు ఉండనుండగా, మొత్తం ఐదు యాడ్లను కలుపుకుంటే వీడియో ప్రారంభం కావడానికి 30 సెకన్లు పడుతుంది. ఈ విషయంపై ఓ యూజర్ యూట్యూబ్‌కి ఫిర్యాదు చేయగా, ఇది నిజమేనని చెప్పింది. అంతేకాక, మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వమని సదరు యూజర్‌ని కోరింది. ఇలా కొంతమంది యూజర్ల ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని వారి నుంచి వచ్చే ప్రతిస్పందన చూసి ఈ అంశంలో ముందుకెళ్తామని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే రెండు యాడ్లతో విసిగిపోయిన ప్రేక్షకులకు యూట్యూబ్ తీసుకున్న తాజా నిర్ణయంతో మరింత సహనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.