యూట్యూబ్ కీలక నిర్ణయం..ఆ వీడియోలకు చెక్! - MicTv.in - Telugu News
mictv telugu

యూట్యూబ్ కీలక నిర్ణయం..ఆ వీడియోలకు చెక్!

February 4, 2020

youtub..

ప్రపంచ ప్రఖ్యాత వీడియో స్ట్రీమింగ్ ఆప్ యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. నిరాధార వార్తలను, ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని యూట్యూబ్‌లో నిషేధించనున్నట్లు గూగుల్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు మరణించారనిగానీ, ఎన్నికల తేదీ వ్యవహారంలో తప్పుడు సమాచారంగానీ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తే దాన్ని తొలగిస్తామని వెల్లడించింది. 

ఇందుకోసం ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఆ వీడియోలను ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ టీమ్‌లు నిరంతరం పరిశీలిస్తుంటాయని చెప్పింది. వార్తలకు నమ్మదగిన స్థానం కలిగిన దానిగా యూట్యూబ్‌ను మార్చనున్నట్లు తెలిపింది. ‘వార్తా సమాచారానికి విశ్వసనీయ సోర్స్‌గా యూట్యూబ్‌ను తీర్చిదిద్దేందుకు గత కొన్నేళ్లుగా కసరత్తు ముమ్మరం చేశాం. అదే సమయంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు బహిరంగ వేదికగా మలిచేందుకు కృషి చేస్తున్నామ’ని యూట్యూబ్‌ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ లెస్లీ మిల్లర్‌ పేర్కొన్నారు.