రష్యన్ మీడియా ఛానెళ్లను నిలిపివేసిన యూట్యూబ్ - MicTv.in - Telugu News
mictv telugu

రష్యన్ మీడియా ఛానెళ్లను నిలిపివేసిన యూట్యూబ్

March 1, 2022

you

పసికూన ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యాపై అనేక దేశాలు ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించగా ఇప్పుడు గూగుల్ కూడా తన ప్రతాపాన్ని చూపెడుతోంది. అమెరికాకు చెందిన గూగుల్ రష్యన్కం టెంట్ ను బ్లాక్ చేయగా, ఇప్పుడు తన అనుబంధ సంస్థ అయిన యూట్యూబ్ లోనూ ఆంక్షలు విధించింది. ఇదివరకే రష్యన్ మీడియాకు యూట్యూబ్ తన ప్రకటనలను నిలిపివేయగా.. తాజాగా రష్యా మీడియా ఛానెళ్లను నిలిపివేసింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక మీడియా ఛానెళ్లయిన ఆర్టీ, స్పుత్నిక్ ల ప్రసారాలను నిలిపివేయడంతో ఆ దేశ వార్తలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా, రష్యా తన అధికారిక ఛానెళ్ల ద్వారా ఉక్రెయిన్ వ్యతిరేక వార్తలను, అబద్ధాలను ప్రచారం చేస్తోందని, వాస్తవ పరిస్థితి తెలియకుండా పోతోందని యూట్యూబ్ ప్రధానంగా ఆరోపిస్తోంది.