యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న మన జగిత్యాల పోరగాళ్లు. - MicTv.in - Telugu News
mictv telugu

 యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న మన జగిత్యాల పోరగాళ్లు.

June 19, 2017

మనకు తెలిసిన కథలే…మనం  సూశిన మన్షులే కనీ మల్లా కొత్త వేలో ఆళ్లను మనకు పరిచయం చేస్తున్నరు” మై విలేజ్ షో” అనే యూట్యూబ్ ఛానల్ తోని  కొందరు యువకులు,పల్లెలోని స్వచ్చమైన మనుషుల్ని చక్కటి వాతావరణాన్ని యాసను భాషను వాళ్ల అలవాట్లను వాళ్ల స్వచ్చమైన అభిప్రాయాలను,నవ్వుల్ను …. ఈళ్ల వీడియోద్వారా సూపెట్టి పల్లెలకు దూరమై బతుకుతున్నోళ్లందరికి మల్లా పల్లెల వైపు మన్సు గుంజెటట్టు జేస్తున్నరు,వీళ్ల వీడియోలకు లైక్స్ కామెంట్సే కాదు ఫాలోవర్సుకూడా ఎక్కువే,వీళ్లు చేసే కామెడీకి నెటిజన్లు బాగా ఫిదా ఐపోతున్రు.వీళ్ల కామెడీ వీడియోస్ ఎక్కువగా వాట్సప్ గ్రూప్ లలో షేరవుతుంటాయ్.

ఇంతకీ వీళ్లు ఏం షూట్ చేస్తారు

సిటీ మన్షులు వాడే ఏదైనా వస్తువునో లేక సామాజిక అంశమో లేక కొత్తగ రిలీజైన సిన్మనో  ఏదో ఒక సబ్జెక్ట్ తీస్కొని ఊర్లో ఉన్న అవ్వలు తాతలు,పోరగాన్లు ఇలా అన్ని వయసుల వారి దగ్గరకు వెళ్లి వాళ్లు దానిగురించి ఏమన్కుంటున్రు, వాళ్లకు ఆ వస్తువులమీద విషయాలమీద ఎంత అవగాహన ఉంది అని ఒక్కొక్కరి అడిగి…దాని గురించి వాళ్లకు వివరిస్తారు…దీనినంతా వీడియో తీస్తారు ఈక్రమంలో ఎంతో ఫన్ క్రియేట్ అవుతుండం విశేషం.వీళ్ల వీడియోలు జూస్తే అచ్చం మనం ఊర్ల మన దోస్తులతోని మన ఇంట్లున్న ముసలోల్లతోని మన ఊరి మన్షులతోని మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది.

క్రికెట్,అసెంబ్లీ,బాహుబలి ఇలా ఏదైనా

ఊర్ల పోరగాన్లు క్రికెట్ ఆడితే అన్ల మనం మాట్లాడుకునే మాటల్నే వీడియో దీస్తే ఎంత ఫన్నీగ ఉంటది ఎంత నేచురల్ గ ఉంటదో…విలేజ్ క్రికెట్ కష్టాలు అని వీళ్లు తీసిన వీడియోచూస్తే చిన్నప్పుడు మనం క్రికెట్ ఆడిన రోజుల్ను గుర్తుకు తెచ్చుకుంటాం,అసెంబ్లీ.. పార్లమెంట్లు ఊర్లో జరిగితే ఎంత ఫన్నీగ ఉంటుంది,బాహుబలిని కట్టప్ప ఎందుకు సంపిండో ముసలవ్వ అల్లువట్టి శెప్తె ఎట్లుంటది,ఇలా ఒకటా రెండా సినిమా స్పూఫ్స్,ఊర్ల జరిగే పండుగలు పబ్బాలు ఎవ్విట్ని ఇడ్శిపెట్టరు అన్నింటిమీద వీడియో తీసి ఫన్ క్రియేట్ చేయడం వీళ్ల ప్రత్యేకత. సెలెబ్రిటీల గురించి పల్లెటూర్లున్నోళ్లు ఏమన్కుంటున్నరు దగ్గరినుంచి.. ఆఖర్కి అమెరికా అధ్యక్షుని మీద కూడా ఊర్ల వీడియో తీశెశిన్రు వీళ్లు.

పెద్ద పెద్ద లొకేషన్లు లేవు..తోపు ఆర్టిస్టులు లేరు,పెద్ద పెద్ద కెమ్రాలు లేవు

జగిత్యాల జిల్లా లంబాడిపల్లి అనే చిన్న గ్రామం, ఆ ఊళ్లో ఉన్న శెట్టుపుట్ట  దగ్గరికేలి… ప్రతీగల్లీ వాళ్లలొకేషనే, తను ఉన్న ఊరునుంచి.. ఇక్కడి మన్షులనుంచి మంచి వీడియోలు తీయలేనా అందరి దృష్టినీ ఆకర్షించలేనా అని శ్రీకాంత్ అనే యువకుడు చేసిన చిన్న ప్రయత్నం ఈ “మై విలేజ్ షో”.శ్రీకాంత్ కరీంనగర్ లో జాబ్ చేస్తూనె వీలు దొర్కినప్పుడల్లా ఊర్లో షూటింగ్ చేసేవాడు ,అలా కొన్ని రోజులకు శ్రీకాంత్ చేసిన వీడియోలకు  మంచి రెస్పాన్స్ వస్తుండడంతో జాబ్ కూడా మానేసి ఫ్రెండ్స్ తో కలిసి మై విలేజ్ షో అని యూట్యూబ్ చానల్ క్రియేట్ చేసి వరుసగా వీడియోలు చేస్తున్నాడు…వీళ్ల వీడియోలకే కాదు అందులో కనిపించె అవ్వలు తాతలు కూడా ఫేమస్ అయ్యారు,వాళ్లు ఎక్కడివెల్లినా అగో మల్లక్క నువ్ గ విడియోల కన్పిచ్చినవ్ గదా..ఆ పోశవ్వ నువ్వుగుడున్నవ్ అన్ల అని కనవడ్డోళ్లంత వాళ్లను పల్కరిచ్చిపోతరట,

ఓ అవ్వ..ఓ పెద్దబాపు అరెయ్ చిన్నా ఇయ్యాల షూటింగ్ ఉన్నది అని శ్రీకాంత్  చెప్పడమే ఆలస్యం…అట్లనే శేద్దాం బిడ్డా దుమ్ములేపుదాం, మన ఊరు తడాకా ఏంటిదో దున్యకు సూపిద్దాం అని శ్రీకాంత్ కు సహరించేవారెందరో.

చెయ్యాలన్న కసి ఉండాలె కనీ ఊరైతె ఏంటి…అడివి ఐతేంటి,సిటీ అయితేంటి, కంటెంట్ ఉన్నోడు వానికున్న పరిదిలోనే అద్బుతాలు సృష్టించచ్చు అని నిరూపించిండు లంబాడిపల్లికి చెందిన శ్రీకాంత్.

కన్నోళ్లను ఉన్నఊరిని వదిలేసి రంగుల ప్రపంచలో ఏదో సాధించాలని..ఎంతో ఆశతో పట్నాలకచ్చి ఇక్కడ అవకాశాలురాక  ఏదో ఒక పనిచేసుకుంటు జీవీతాన్ని నడిపిస్తున్నవారెందరో…కానీ శ్రీకాంత్ ఉన్న ఊర్లోనే టెక్నాలజీని వాడుకొని తను అనుకున్నది సాధిస్తున్నడు,రంగుల ప్రపంచంలో ఏదో సాధించాలన్న ఎందరికో శ్రీకాంత్ అతని స్నేహితులు ఆదర్శమైతున్నరు.పల్లెను పల్లెలోని మన్షుల్ను అక్కడి నేచర్ ను ప్రపంచానికి  తమదైన శైలిలో పరిచయం చేస్తున్న జగిత్యాల పోరగాండ్లను అభినందిద్దాం,ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నోతీసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిద్దాం.