ఓ యువకుడు తనకున్న టాలెంట్‌తో సరదాగా చేసిన పని అతణ్ని అప్పుల బాధ నుంచి తప్పించింది. అంతే కాదు.. హాబీగా చేసిన పనే ఇప్పుడు అతని వ్యాపకం అయింది. ఆ పని ద్వారా ఇప్పుడతడు కూర్చొని సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే బ్రిటన్‌లో నివసిస్తున్న అర్జున్ యోగాన్ అనే వ్యక్తి తల్లి అనారోగ్యానికి గురైంది. దీంతో అతని తండ్రి ఉద్యోగం మానేయాల్సిన పరిస్థితి ఇంకా ఏర్పడింది. ఇంకా.. ఆమె తల్లికి చికిత్స చేయించడం కోసం ఆ కుటుంబానికి రూ.40 లక్షల భారీ అప్పు అయ్యింది. ఈ క్రమంలో ఆ అప్పును తీర్చేందుకు అర్జున్.. తన గ్రాడ్యుయేట్ పూర్తవగానే ఓ బీమా కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. సంవత్సరం పాటు ఆ ఉద్యోగం చేశాడు. అయితే అతనికో హాబీ ఉంది. యామినేషన్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టమున్న అర్జున్.. తన గ్రాడ్యుయేషన్ సమయలో కాలేజ్ అవ్వగానే ఫ్రీ టైమ్ లో యానిమేషన్ వీడియోలు క్రియేట్ చేసేవాడు. వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవాడు. దీనివల్ల అతనికి సబ్స్క్రైబర్స్ బానే వచ్చారు, అలాగే ఇతని వీడియోస్‌కు కూడా వ్యూస్ బానే వచ్చేవి.
సంవత్సరం పాటు ఉద్యోగం చేశాక గమనించుకుంటే అతనికి తన ఉద్యోగం ద్వారా వచ్చే సాలరీ, యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం దాదాపు సమానంగా ఉన్నాయని అర్థమైంది. అంతే.. తన ఉద్యోగం వదిలేసి ఫుల్ టైం యూట్యూబ్ వీడియోస్ చేయడంపై ఫోకస్ పెట్టాడు. ఫలితంగా అతనికి యూట్యూబ్‌లో 8లక్షల సబ్స్క్రైబర్స్ పెరిగారు. అతని వీడియోస్‌కు మూడుకోట్ల వ్యూస్ వచ్చాయి. వీటి వల్ల అతనికి యూట్యూబ్ నుండి ఊహించనంత ఆదాయం రావడం ప్రారంభమయింది. దాంతో తల్లిదండ్రులు చేసిన 40లక్షల అప్పు తీర్చేసాడు. తల్లికి వైద్యం చేయించాడు, సౌత్ లండన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొన్నాడు, బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. ప్రస్తుతం ఇతను నెలకు కోటి రూపాయల పైనే యూట్యూబ్ నుండి ఆదాయం పొందుతున్నాడట.
ఇతని గురించి తెలిసినవారు… బతకడానికి, సంపాదించడానికి ఉద్యోగమే చేయక్కర్లేదని.. టాలెంట్ కు తగిన మార్గాన్ని ఎంచుకుంటే సక్సెస్ అవుతారనడానికి అర్జునే మంచి ఉదాహరణ అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
రేవంత్ రెడ్డి అరెస్ట్.. బొల్లారం పీఎస్‌కు తరలింపు
‘మా సినిమా చూస్తే.. రూ.లక్ష బహుమతి ఇస్తాం.. కానీ ఓ కండీషన్’