Youtuber name Amit Sharma sets car on fire by bursting 1 lakh Fire crackers , Video Viral
mictv telugu

Video: ఇది కూడా దీపావళి సెలబ్రేషనే.. కాకపోతే కాస్త వింతగా

October 25, 2022

దీపావళి పండుగ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది.. దీపాల వెలుగుల్లో అందమైన రంగోళీ, దీపాల వరుస, ఆ తర్వాత టపాసులు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమో లేదా ఎంజాయ్ చేయడం కోసమో చిలిపి పనులు చేస్తూ ఉంటారు. అలా వెరైటీగా బాణాసంచా కాల్చలనుకున్న ఓ యువకుడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాంక్ అవుద్ది.

రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్‌ అమిత్‌ శర్మ.. దీపావళి సందర్భంగా తన కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం అంకెలు లెక్కపెడుతూ.. రెడీ అని కారుపై పేర్చిన బాంబులను పేల్చాడు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్ధంతో మారుమోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ కారు దగ్గరుకు వెళ్లాడు.

బాంబులు పేలడంతో కారు కలర్‌ మొత్తం మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయి ఉంది. కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్‌ పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్‌ మాత్రం పనిచేయడం గమనార్హం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్‌ మళ్లీ కారును స్టార్ట్‌ చేసి డ్రైవింగ్‌ చేస్తూ తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.