మీరు చాలాసార్లు చూశారు, ఇక ప్రదర్శించలేం.. యూట్యూబ్ షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

మీరు చాలాసార్లు చూశారు, ఇక ప్రదర్శించలేం.. యూట్యూబ్ షాక్

January 13, 2020

Black Widow.

తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే వారి అభిమానులు చేసే సందడి గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ కటౌట్లు అంటారు. పాలాభిషేకం చేస్తారు. గజమాలలు, థియేటర్లలో ఈలలే ఈలలు. సినిమా హిట్టా, ఫ్లాపా అన్న విషయం మరిచి సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తారు. విడుదల అయిన టీజర్, ట్రైలర్‌లకు భారీ వ్యూస్ తీసుకురావాలని తెగ ఉబలాట పడుతుంటారు. అలాంటి అతి అభిమానులకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. 

On that note, one more time!#BlackWidow

Publiée par Marvel sur Lundi 13 janvier 2020

యూట్యూబ్‌లో అదేపనిగా అభిమాన హీరోల చిత్రాల టీజర్‌లు చూసేవారికి ఆ సంస్థ షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్‌ తెరకెక్కిస్తున్న ‘బ్లాక్‌ విడో’ సినిమా టీజర్‌ను పదేపదే చూస్తున్న ఓ నెటిజన్‌ను యూట్యూబ్‌ హెచ్చరించింది. ‘మీరు ఇప్పటికే 28,763 సార్లు ఈ వీడియోను చూశారు. అందువల్ల మరోసారి దానిని ప్రదర్శించలేకపోతున్నాం’ అని  తెలిపింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. దీంతో అతను షాక్‌కు గురయ్యాడట. అతని గురించి వదిలేస్తే యూట్యూబ్‌లో ఒకే వీడియోను పదేపదే చూసేవారికి కూడా ఇదే రకమైన పరిస్థతి ఎదురయ్యే అవకాశం ఉంది. మన దేశంలో పెద్ద హీరోల సినిమాలకైతే కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ వస్తుంటాయి. దాని వెనకాల మతలబు అభిమానులది అయితే ఇక వారికి పెద్ద షాకే మరి. యూట్యూబ్‌ ఈ నిబంధనను భారత్‌లో అమలు చేస్తే.. ఫేక్ వ్యూస్ పని ఖతం అయినట్టే లెఖ్ఖ.