YS Jagan fan Ramesh has joined TDP
mictv telugu

టీడీపీలో చేరిన జగన్ వీరాభిమాని

July 11, 2022

 

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరాభిమాని ఒకరు ఆ పార్టీని వీడి శనివారం టీడీపీలో చేరాడు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ జగన్‌పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వలేటివారి పాలెం మండలం చుండికి చెందిన ముతకని రమేష్.. తన కుడి చేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నారు. తర్వాత మారిన పరిణామాలతో మనసు మార్చుకొని టీడీపీలో చేరాడు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తన బంధువులు, మిత్రులతో కలిసి రమేష్ టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.