వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జరిగిన భేటీలో పార్టీ గురించి ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ హాట్ కామెంట్లు చేశారు. ‘గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్య తగ్గకూడదు. అసలు మొత్తం సీట్లు 175 ఉంటే.. మనం 175 సీట్లు ఎందుకు గెలవకూడదు? అన్ని సీట్లు మనకు ఎందుకు రాకూడదు’? అని వ్యాఖ్యానించారు.
అంతేకాక, 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ విజయమే టార్గెట్గా పనిచేయాలని సూచించారు. మంత్రులు అందరినీ కలుపుకుపోవాలని ఆదేశించారు. ప్రతీ ఎమ్మెల్యే నెలకు కనీసం 10 సచివాలయాలు తిరగాలంటూ దిశానిర్దేశం చేశారు.