వైఎస్ జగన్‌కు బెస్ట్ సీఎం అవార్డు.. ఇది రెండో సారి - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్ జగన్‌కు బెస్ట్ సీఎం అవార్డు.. ఇది రెండో సారి

May 18, 2022

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి అరుదైన గౌరవం దక్కింది. గ్రామీణాభివృద్ధి, సుపరిపాలనలో వరుసగా రెండోసారి స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో బెస్ట్ సీఎంగా ఎంపికయ్యారు. ఈ అంశంలో టాప్ 5 లో దక్షిణాది నుంచి ఏపీ ఒక్కటే ఉండడం గమనార్హం. పశ్చిమ బెంగాల్, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రలు వరుసగా ఉన్నాయి. ప్రతీ ఏడాది స్కోచ్ సంస్థ ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు, పరిపాలనా విధానాలు, కొత్త సంస్కరణలు, సంక్షేమ పథకాలపై అధ్యయనం చేస్తుంది. ఏపీలో ప్రభుత్వం తీసుకొచ్చిన వార్డు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, సంక్షేమ పథకాలు ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపాయి.