రాజధాని రగడ.. వైఎస్సార్ విగ్రహానికి నిప్పు - MicTv.in - Telugu News
mictv telugu

రాజధాని రగడ.. వైఎస్సార్ విగ్రహానికి నిప్పు

January 21, 2020

Ys rajashekhara reddy.

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వివాదం తారస్థాయికి చేరింది. మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పరిధిలోని తుళ్ళూరు మండలం దొండపాడు గ్రామంలో దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. అర్ధరాత్రి ప్రాంతంలో జరిగిన విషయం ఈ ఉదయం వెలుగు చూసింది. ఈ ఘటనతో దొండపాడు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. 

దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకుని నిరసనలకు దిగారు. ఇదంతా టీడీపీ నేతల కుట్రేనని వారు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న తుళ్లూరు పోలీసులు, దొండపాడుకు అదనపు బలగాలను పంపారు. పరిస్థితులు అదుపు తప్పకుండా, ఎలాంటి అవాంచనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.