వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారని ఆరోపించారు. తనని కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. తాను పులిబిడ్డనని.. తనకు భయం లేదని చెప్పారు. కేసులు పెడితే భయం లేదని… దమ్ముంటే అరెస్టు చేయండి అంటూ షర్మిల్ సవాల్ విసిరారు. వనపర్తి పాదయాత్ర ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. “ పాదయాత్ర ఆపుతారట..నా పాదయాత్ర తో ప్రజల్లో అభిమానం పెరుగుతుందని మీకు అర్థం అయ్యింది. పాదయాత్ర తో ప్రజా సమస్యలు బయటకు వస్తున్నాయని మీకు తెలిసింది. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత బయట పడింది. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీని కట్టడి చెయ్యడానికి కుట్ర చేస్తున్నారని” షర్మిల ఆరోపించారు.
కేసీఅర్ కి తెలిసింది ఒకటే.. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు. మా పై నిరంజన్ రెడ్డి పిర్యాదు చేస్తే వెంటనే FIR ఫైల్ చేశారు. అదే నిరంజన్ రెడ్డి మీద మేము పిర్యాదు చేస్తే యాక్షన్ లేదు అని మండిపడ్డారు. కనీసం FIR కూడా నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరదలు అని అసభ్యకర పదజాలంతో దోషిస్తే కేసు పెట్టడం లేదు. నా ఆత్మాభిమానం దెబ్బ తీస్తున్నారు. నన్ను మరదలు అంటే నేను పట్టించుకోకుండా ఉండాలా..? అని ప్రశ్నించారు. ఇదేనా తెలంగాణలో మహిళల మీద గౌరవం? “అని మండిపడ్డారు. షర్మిల్ చేసిన ఈకామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.