YS Sharmila Support To TRS
mictv telugu

టీఆర్ఎస్‌కు షర్మిల ఫుల్ సపోర్ట్..! సడెన్ గా టోన్ ఎందుకు మారింది?

October 22, 2022

టీఆర్ఎస్ అంటే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఒంటికాలుపై లేస్తారు. పొద్దున లేస్తే కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతారు. తెలంగాణ అంతా తిరుగుతూ తిట్టిపోస్తున్నారు. పాదయాత్రలో 90శాతం సమయం టీఆర్ఎస్ పై విమర్శలకే కేటాయిస్తున్నారు. సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజలతో ముచ్చటిస్తూ సర్కార్ ని తూర్పుర పడుతున్నారు. కానీ సడెన్ గా షర్మిల ఎందుకు టోన్ మార్చింది?

మునుగోడు ఎన్నికపై జోస్యం

మునుగోడు ఉపఎన్నిక వేళ హఠాత్తుగా టీఆర్ఎస్ పై ప్రేమ పుట్టుకొచ్చింది. మామూలుగా కాదు ఫుల్ సపోర్ట్ కారుకే అంటూ క్లారిటీ ఇచ్చేశారు. పనిలోపనిగా మునుగోడు బై పోల్ పై జోస్యం చెప్పారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఇక్కడితో ఆగలేదు..బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్ బ్రదర్స్ అని ఆరోపించారు.

YS Sharmila Support To TRS

టీఆర్ఎస్‌ని ఒక్కమాట అనలే…

కోమటిరెడ్డి బ్రదర్స్ పై విరుచుకుపడిన షర్మిల టీఆర్ఎస్‌ను ఒక్కమాట అనలేదు. ఈ ఎన్నిక అధికార పార్టీకి, ఓ నేత అహంకారానికి మధ్య జరుగుతోందన్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో జరుగుతోందని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలో వైఎస్సార్టీపీ ఎందుకు పోటీ చేయలేదనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరగడం లేదని షర్మిల స్పష్టం చేశారు.

YS Sharmila Support To TRS

నా రోల్ మోడల్ జగన్ కాదు…

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తామని షర్మిల చెప్పారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. తన రోల్ మోడల్ అన్న జగన్ కాదని… నాన్న రాజశేఖరరెడ్డి అని పర్మిల చెప్పారు. ఎప్పుడూ టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యే షర్మిల ఇప్పుడు ఎందుకు టోన్ మార్చింది అని అంతా చర్చించుకుంటున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారేమోనని కొందరు అంటున్నారు.