భవిష్యత్తులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు మాజీ ఎంపీ డి. శ్రీనివాస్. సోమవారం వైఎస్ షర్మిల డి. శ్రీనివాస్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని కాసేపు ఆయనతో ముచ్చటించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, దేశ రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుండగా.. ఈ సందర్భంగా డీఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సీఎం అవుతారని 2003లోనే తాను చెప్పానని గుర్తుచేసుకున్న ఆయన… భవిష్యత్తులో వైఎస్ బిడ్డ షర్మిల సీఎం అవుతుందన్నారు.
వైఎస్సార్ తో ఉన్న పాత అనుభవాలను గుర్తు చేసుకున్నారు డీఎస్. తెలంగాణ ప్రజల్లో వైఎస్సార్‌పై అభిమానం చెక్కు చెదరకుండా ఉందని చెప్పారు. సరైన సమయంలో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉండబోతుందన్న ఆయన.. షర్మిలను ఒక ఐరన్ లేడీగా అభివర్ణించారు. నా రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. షర్మిల ముఖ్యమంత్రి అవుతుందన్నారు. భవిష్యత్ లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి తప్పకుండా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు డి. శ్రీనివాస్.