YS Sharmila's sensational statement in Viveka's murder case
mictv telugu

మా బాబాయిని వాళ్లే చంపించారు.. మీడియాతో వైఎస్ షర్మిల

November 3, 2022

తన బాబాయి వివేకానంద రెడ్డిని హత్యకి కేవలం తమ కుటుంబంలోని గొడవలే ప్రధాన కారణమని మీడియాకు తెలిపారు వైఎస్ షర్మిల. ఆయన్ను హత్య చేయడానికి మరేతర కారణాలేవీ లేవని, ఆయనకు వేరే శత్రువులు కూడా ఎవరూ లేరని ఆమె అన్నారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన సమాచారం ఇవ్వాలంటూ సీబీఐ అధికారులు ఆమెను కోరగా.. గత నెల 7వ తేదీన షర్మిల ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి, వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలంలో వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డే వివేకాను చంపించారని ఆమె చెప్పినట్లు సమాచారం.

కడప ఎంపీ టికెట్‌ విషయంలో తమ కుటుంబంలో గొడవలున్నాయని చెప్పారు షర్మిల. తనకు టిక్కెట్ దక్కుతుందో లేదో అని, ఎంపీగా పోటీకి దిగితే తమ ఉనికికి ఇబ్బంది అని అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డే వివేకాను చంపించారని మాకున్న సమాచారమని షర్మిల చెప్పారు. గత నెల 21వ తేదీన ఆమె మరోమారు ఢిల్లీకి వెళ్లి… కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి వివేకాను హత్య చేయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ పేర్కొంది కదా! దీనిపై మీ స్పందన ఏమిటి?’’ అని మీడియా ప్రశ్నించగా… ‘వాస్తవం’ అని షర్మిల సూటిగా స్పందించారు. ‘‘నా కుటుంబంలో జరిగిన ఘోరమిది సునీతకు న్యాయం జరగాలి. మా చిన్నాన్నను ఎవరు అంత ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటికి రావాలి. వారికి శిక్ష పడాలి. దీన్ని ఎవరూ అడ్డుకోడానికి వీల్లేదు’’ అని కూడా అన్నారు.