వైఎస్‌పై పుస్తకం రాయడానికి కారణం ఇదే : విజయమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్‌పై పుస్తకం రాయడానికి కారణం ఇదే : విజయమ్మ

July 8, 2020

YS Vijayamma Released Book

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ నివాళ్లు అర్పించారు. తన తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్ఆర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. తాను ప్రత్యేకించి పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో వివరించారు.

‘33 ఏళ్ల దాంపత్య జీవితంలో వైఎస్ చూపిన మంచితనం, మాటల ఆధారంగా ఈ పుస్తకం రాశాను. 

మానవత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారు. ఎంతో మంది జీవితాల్లో ఆయన వెలుగులు నింపారు. ఆయన చెప్పే మాటలను నా కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు ప్రతి నిర్ణయంలోనూ గుర్తు చేసుకుంటారు. అందుకే ప్రతి మాట, ప్రతి అడుగు గురించి చాలా మంది తెలుసుకోవాల్సి ఉంది. రాజకీయ ప్రత్యర్థులు కూడా వీటిని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతోనే రాయాల్సి వచ్చింది’ అని వివరించారు. తన సుదీర్ఘ జీవన ప్రయాణంలో అనేక అంశాలు ఈ పుస్తకంలో పొందుపరిచానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదవాలని కోరారు.