వివేకా హత్య కేసులో సుధాకర్ రెడ్డిపై అనుమానాలు! - MicTv.in - Telugu News
mictv telugu

వివేకా హత్య కేసులో సుధాకర్ రెడ్డిపై అనుమానాలు!

March 15, 2019

వైఎస్ వివేకానంద అనుమానాస్పద మృతి కాస్తా హత్యగా నిర్ధారణ కావడంతో హంతకులు ఎవరన్నదానిపై ఏపీ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వివేకాతో శత్రుత్వం ఉన్నవారిపై, శత్రుత్వం ఉండే అవకాశమున్న వారిపై దృష్టి సారిస్తున్నారు. వివేకా తండ్రి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో జైలుశిక్ష అనుభవించి ఇటీవల విడుదలై రాగిపిండి సుధాకర్ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడు సత్ప్రవర్తనతో ముందస్తుగానే విడుదల కావడంతో అనుమానాలకు బలం ఉండకపోవచ్చనీ భావిస్తున్నారు. కానీ దర్యాప్తులో భాగంగా ఏ కోణాన్నీ విస్మరించలేమని చెబుతున్నారు.

1998 నాటి రాజారెడ్డి హత్యకేసులో దోషిగా తేలిన సుధాకర్ రెడ్డితోపాటు ఇతర దోషులకు 2006లో కోర్టు జీవిత ఖైదు వేసింది. అప్పట్నుంచి నెల్లూరు జైల్లో శిక్ష అనుభవించాడు. కడప జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి జైల్లో సత్ప్రవర్తనతో మెలగడంతో ఏపీ ప్రభుత్వం అతణ్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. అతడు 11 ఏళ్ల 10 నెలలపాటు జైల్లో ఉన్నాడు.  రాజకీయ ఒత్తిళ్లతోనే అతణ్ని విడుదల చేసినట్లు వైఎస్ అభిమానులు ఆరోపించారు.