వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్.. సీబీఐ విచారణలో కొత్త పేరు - MicTv.in - Telugu News
mictv telugu

 వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్.. సీబీఐ విచారణలో కొత్త పేరు

September 24, 2020

cn vbnmhm

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. అప్పట్లో దీని కేంద్రంగా వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, పత్యారోపణలు వచ్చాయి. ఈ తరుణంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విచారణలో పురోగతి సాధించలేదు. దీంతో వివేకా కూతురు సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించడంతో అధికారులు దూకుడు పెంచారు. కీలక ఆధారాలు సేకరిస్తూ.. పలువురిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తపేరు తెరపైకి వచ్చింది. మున్నా అనే వ్యక్తి పేరు ఉండటంతో అతని కుటుంబ సభ్యులను విచారించి వారి కదలికలపై ఫోకస్ పెట్టారు. 

పులివెందులలో చెప్పుల దుకాణం నడుపుకునే మున్నా బ్యాంకు ఖాతాలో భారీ ఎత్తున నగదు, నగలు ఉండటం సీబీఐ గమనించారు. ఏకంగా  రూ. 48 లక్షల నగదు, 25 తులాల బంగారం, రూ. 20 లక్షల ఎఫ్‌డీలు ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మున్నాకు వివేకానంద రెడ్డి సన్నిహితుడిగా ఉండేవారని చెబుతున్నారు. అతని ఫ్యామిలీ వివాదాల్లో వైఎస్ వివేకాందరెడ్డి కలగజేసుకున్నట్లు సమాచారం అందింది. మున్నా మూడు వివాహాలు చేసుకోవడంతో దీనిపై మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మున్నా మొదటి భార్యను విచారించగా నగదు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే.