Ys Vivekananda Reddy case supreme court issues notices to Andhra Pradesh jagan mohan reddy cbi
mictv telugu

వివేకా హత్యకేసులో జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

September 19, 2022

Ys Vivekananda Reddy case supreme court issues notices to Andhra Pradesh jagan mohan reddy cbi

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన మూడేళ్లు దాటిపోయినా ఎలాంటి పురోగతీ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. దర్యాప్తులో అవకతవకలు జరుగుతున్నాయని, ఏపీలో తమకు న్యాయం జరగదని ఆమె లాయర్లు వాదించారు. విచారణను తెలంగాణకు బదిలీ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ఏపీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందో పూర్తి సమాచారం అందివ్వాలని ఆదేశించింది.

‘‘విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదు. నిందితులు బెయిల్ పై బయటికి వస్తూ, సాక్షులను బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో విచారణ జరిగితే మాకు న్యాయం జరగదు. కడపలో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. విచారణ తెలంగాణ హైకోర్టు పరిధిలో జరిపించేలా చూడండి’ అని సునీత కోరారు. వివేకానంద రెడ్డి 2019 మార్చిలో ఎన్నికల సమయంలో పులివెందులలోని తనింట్లో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్ మామ గంగిరెడ్డి తదిరులపై ఆరోపణలు ఉన్నాయి.